మంద రాజయ్య కు ఘనంగా నివాళులర్పించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బిరుదు రాజమల్లు రెండవ కుమారుడు బిరుదు శ్రీనివాస్ మామ మంద రాజయ్య ఇటీవల మృతిచెందగా 11వ రోజు పెద్దకర్మ కార్యక్రమం లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పాల్గొని రాజయ్య చిత్రపటం వద్ద ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం విజయరమణారావు మంద రాజయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎమ్మెల్యే వెంట సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, నర్సింహులపల్లి సర్పంచ్, నరసింహ స్వామీ టెంపుల్ చైర్మన్ , ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యక్రమంలో పాల్గొని రాజయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మంద రాజయ్య కు ఘన నివాళులు అర్పించారు....






