రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు
07-05-2026 05:39 PM
వాంకిడి, (విజయక్రాంతి): వాంకిడి మండలం సామెల గ్రామంలో గురువారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రొఫెసర్ అనురాధ, సౌజన్య పాల్గొని రైతులకు పంటల సాగులో మెలకులవల పై అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ.. పంట సాగులో యూరియా వాడకం, పెట్టుబడులు తగ్గించడం, మట్టి పరీక్షలు, నేల ఆరోగ్యాన్ని కాపాడు కోవడం వంటి విషయాలపై వివరించారు. ఈ సందర్భం గా వాంకిడి మండల వ్యవ సాయ అధికారి గోపికాంత్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను మండల రైతులు సద్విని యోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈవో అరవింద్, గ్రామ సర్పంచ్ సంతోష్‌తో, రైతులు తదితరులు పాల్గొన్నారు.






