7 May, 2026 | 6:25 PM

ఇంటర్ బోర్డు విలీనంపై ప్రభుత్వం పునరాలోచించాలి

07-05-2026 05:35 PM

ఎకనామిక్స్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావుల తిరుమల్

మంథని,మే07(విజయ క్రాంతి): తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డును విద్యాశాఖలో విలీనం చేసే అంశంపై ప్రభుత్వం ఒక్కసారి పునరాలోచన చేయాలని తెలంగాణ ఎకనామిక్స్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావుల తిరుమల్ గురువారం ఒక ప్రకటనలో కోరారు. ప్రత్యేకంగా కొనసాగుతున్న ఇంటర్మీడియట్ బోర్డును విలీనం చేయడం వల్ల విద్యార్థులపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు.

ప్రత్యేక బోర్డు ఉండటం వల్లనే జాతీయ స్థాయి పరీక్షల్లో తెలుగు విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారన్నారని,  ఈ మార్పుల వల్ల అటు విద్యార్థులు, ఇటు ఇంటర్ వ్యవస్థ లో పని చేస్తున్న అధ్యాపకులు, ప్రిన్సిపాల్లు, సిబ్బంది  ఇబ్బందులకు గురవుతారన్నారని, ఇంటర్మీడియట్ అడ్మిషన్ల ప్రక్రియకు షెడ్యూల్ ప్రకటించిన బోర్డు వెంటనే దానిని రద్దు చేయడం తగదన్నారు. పాఠశాలల్లో కళాశాలలను విలీనం చేయడం వల్ల అనేక రకాల సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు.  ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని  విలీనం పై మరోసారి మేధావులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని తిరుమల కోరారు.