7 May, 2026 | 6:26 PM

మాల్తుమ్మెద పిఏసిఎస్ చైర్మన్ దుందిగల్ నర్సింలుకు ఘన సన్మానం

07-05-2026 05:33 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని మాల్తుమ్మెద ప్రాథమిక సహకార సంఘం చైర్మన్‌గా తిరిగి బాధ్యతలు స్వీకరించిన దుండిగల్ నర్సింలును మాజీ జడ్పీటీసీ మనోహర్ రెడ్డి ఘనంగా సన్మానించారు.శాలువా కప్పి అభినందనలు తెలియజేశారు.గత ఏడాది డిసెంబర్ 19న రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో పాలకవర్గాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

దీనిపై పలువురు చైర్మన్లు హైకోర్టును ఆశ్రయించగా,పాత పాలకవర్గాలకు తిరిగి బాధ్యతలు అప్పగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.హైకోర్టు తీర్పు మేరకు జిల్లా సహకార అధికారి రామ్మోహన్‌రావు ఆదేశాలపై బుధవారం నర్సింలుతో పాటు పాలకవర్గ సభ్యులు తిరిగి పదవీ బాధ్యతలు చేపట్టారు.దుండిగల్ నర్సింలు చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మండల మాజీ జెడ్పిటిసి ఉమన్నగారి మనోహర్ రెడ్డి శాలువాతో ఘనంగా సన్మానించారు.ఆయనతో పాటు నాయకులు, కార్యకర్తలు,గ్రామస్తులు వారికి శుభాకాంక్షలు తెలిపారు.