2 September, 2026 | 11:23 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

మస్జీద్ అభివృద్ధికి నిధులు మంజూరు

22-05-2026 | 01:56am

చేగుంట, మే 21: చేగుంట మండలంలోని రాంపూర్ గ్రామంలో ఉన్న మస్జీద్ అభివృద్ధి కి దుబ్బాక కాంగ్రెస్ పార్టి ఇంచార్జ్ సి హెచ్ శ్రీనివాస్ రెడ్డి రూ.7లక్షల రూపాయలను మంజూరు చేయించారు. ఈ మేరకు తన నివాసంలో నిధుల మంజూరుకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీని ముస్లిం సంఘం అధ్యక్షులు సయ్యద్ సల్మాన్ గోరి, సభ్యులకు గురువారం అందజేశారు. కోరగానే మస్జీద్ అభివృద్ధికి  నిధులు మంజూరు చేయించిన శ్రీనివాస్ రెడ్డి కి, మస్జీద్ అధ్యక్షులు సల్మాన్ గోరి, సభ్యులు కృతజ్ఞతలు చెప్పారు.

ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టి మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, గ్రామ సర్పంచ్ మహిపాల్, కన్యారం సర్పంచ్ శంకర్,, మాజీ సర్పంచ్ కాషాబోయిన భాస్కర్, సతీష్, మోహన్, కొలుపుల స్వామి, వార్డ్ సభ్యులు మహేష్, నవీన్, మస్జీద్ కమిటీ ఉపాధ్యక్షులు తయ్యాబ్, సభ్యులు సాజీద్, అన్వర్, ఈనా, అజీమ్, అలీమ్, వాజీద్, తహెర్ తదితరులు పాల్గొన్నారు.