14 May, 2026 | 1:09 AM

కళాశాలకు సంపూర్ణ సహకారం

14-05-2026 12:10 AM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 

జిన్నారం /అమీన్‌పూర్, మే 13 : మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ విద్యారంగంలో చేపట్టిన సంస్కరణల మూలంగా నేడు అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం జిన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన విద్యా వారోత్సవాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్, ఇంటరాక్టు డిజిటల్ ప్యానెల్స్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ విద్యారంగానికి దీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాయని తెలిపారు. 

నియోజకవర్గ పరిధిలో కేజీ నుండి పీజీ వరకు ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. దీని మూలంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు సైతం దొరకని పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. అతి త్వరలో నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల్లో పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాదారం మాజీ సర్పంచ్ సరిత సురేందర్ గౌడ్, జిన్నారం మున్సిపల్ చైర్మన్ జనార్ధన్, వైస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, గడ్డపోతారం మున్సిపల్ వైస్ చైర్మన్ మహేందర్ గౌడ్, వెంకటేష్ గౌడ్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, కళాశాల ప్రిన్సిపల్ కృష్ణకుమార్, బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్