విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటం
కాంగ్రెస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్‌రెడ్డి
హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి) : కేంద్ర ప్రభుత్వం వైఫల్యంతోనే నీట్ పరీక్షాపేపర్ లీకైందని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి మండిపడ్డారు. నీట్ పేపర్ లీకేజీకి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వ హించి మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్ కావడం నిరసిస్తూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం అంబేద్కర్ విగ్ర హం వద్ద ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి ధ ర్మేంద్ర ప్రధాన్ దిష్టి బొమ్మలను దహనం చేశారు.
ఈ సందర్భంగా శివచరణ్‌రెడ్డి మా ట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏ పరీక్ష నిర్వహించినా లీక్ చేయడం, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటం పరిపాటిగా మా రిందని మండిపడ్డారు. దాదాపు 22 లక్షల మంది అభ్యర్థులు నీట్ పరీక్ష రాస్తే.. ఆ పరీక్ష రద్దు కావడంతో విద్యార్థుల భవిష్యత్ అంధకారంలోకి పోయిందన్నారు.
విద్యార్థులు ఎన్నో ఆశలతో కొత్త ప్రయాణా న్ని కొనసాగించాలని గత రెండేళ్లుగా నిరంతర కృషితో రాసిన పరీక్షను రద్దు చేస్తే .. ఆ బాధ ఎలా ఉంటుందో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. యూత్ కాంగ్రెస్ నాయకులు హరిదర్, గుర్రం శ్యామ్ చరణ్‌రెడ్డి, బొమ్మక్ అజయ్, సంతోష్‌గౌడ్, కీజర్, నిశాంత్‌రెడ్డి, పీర్ మునీర్ పాల్గొన్నారు.






