30 July, 2026 | 2:49 AM

సటోరు ఫౌండేషన్‌తో నిమ్స్ ఒప్పందం

30-07-2026 01:01 AM

వృద్ధులకు, డిమెన్షియా రోగులకు ఉచిత సేవలు

పంజాగుట్ట, జూలై 29 (విజయక్రాంతి): సటోరు ఫౌండేషన్ తో నిమ్స్ కీలక అవగాహన ఒప్పందం చేసుకుంది. నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్, సటోరు ఫౌండేషన్ డైరెక్టర్ కనగాల సాయి చరణ్ ఈ ఒప్పంద పత్రాలను పరస్పరం బుధవారం మార్చుకున్నారు.

వృద్ధులు, డిమెన్షియా (మతిమరుపు), ఇతర న్యూరోడిజెనరేటివ్ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఉచితంగా మానసికసామాజిక సహాయక సేవలు అందించడమే ఈ భాగస్వామ్యం ముఖ్య ఉద్దేశంగా ఇరువురు పేర్కొన్నారు. ఈ నిర్ణయం ద్వారా నిమ్స్ న్యూరాలజీ, జెరియాట్రిక్ విభాగాల ఓపీడీలకు ఏటా వచ్చే సుమారు 15 వేల మంది వృద్ధ రోగులకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా సేవలు అందుతాయని రాహుల్ దేవరాజ్ తెలిపారు.

నిమ్స్ వైద్య బృందం పర్యవేక్షణలో సటోరు ఫౌండేషన్కు చెందిన శిక్షణ పొందిన వాలంటీర్లు రోగులకు కౌన్సెలింగ్, జ్ఞాపకశక్తి మార్గదర్శకత్వం, మానసిక ధైర్యాన్ని అందించనున్నట్లు వెల్లడించారు. దీనివల్ల బాధి తులకు ఇంటి వద్దే మెరుగైన సంరక్షణ లభించడంతో పాటు అర్హులైన వృద్ధులను ఆయు ష్మాన్ భారత్ పథకంలో నమోదు చేయడంలో సటోరు ఫౌండేషన్ సహకరిస్తుంద న్నారు. అంతేకాకుండా నర్సింగ్, ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ చివరి సంవత్సరం విద్యార్థులకు జెరియాట్రిక్ సంరక్షణపై ప్రత్యే క శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.