గ్రామాభివృద్దే లక్ష్యంగా ముందుకు
సర్పంచ్ కృష్ణనాయక్
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): ప్రభుత్వ సహకారంతో గ్రామాభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు సర్పంచ్ లూనవత్ కృష్ణనాయక్ అన్నారు.మండల పరిధిలోని సూర్యానాయక్ తండా గ్రామంలో ఉపాధి హామీ నిధులు రూ.10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆదివారం శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ ధ్యేయమని,స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు సహకారంతో గ్రామంలో రహదారులు,డ్రైనేజీలు,త్రాగునీటి సౌకర్యం,పారిశుద్ధ్యం,వీధి దీపాల లాంటి తదితర పనులను దశలవారీగా చేపట్టి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు(Congress Party Village Unit President) రాజేష్ నాయక్,వార్డు సభ్యులు లూనావత్ బిక్కు,బుజ్జి భద్రునాయక్,వెంకటేష్,శిరీష గ్రామస్తులు నంద,కీమా,వీరన్న,బిక్కు,అమర్ సింగ్,లాలు,సురేందర్,ఆంగోతు నర్సింహా,వీరన్న తదితరులు పాల్గొన్నారు.






