21 July, 2026 | 4:39 AM

మానవ సేవే మాధవ సేవ - స్వామి శితికంఠానందజీ మహరాజ్

20-07-2026 10:52 AM

ఎస్‌ఆర్‌కేవీ-వి ఐ హెచ్ ఈ  క్యాంపస్‌ ప్రారంభం

ఖమ్మం టౌన్  (విజయక్రాంతి): వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ వ్యవస్థాపకులు దేవకి వాసుదేవ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్‌ఆర్‌కేవీ-వి ఐ హెచ్ క్యాంపస్‌ను ఖమ్మంలోని శ్రీ రామకృష్ణ విద్యాలయం, గుట్టల బజార్‌లో శ్రీ రామకృష్ణ మిషన్, విజయవాడకు చెందిన పూజ్య స్వామి శితికంఠానందజీ మహరాజ్ ప్రారంభించారు.

ప్రధానోపన్యాసం చేసిన పూజ్య స్వామి శితికంఠానందజీ మహరాజ్ మాట్లాడుతూ, రామకృష్ణ మిషన్ కేవలం సేవా సంస్థ కాదని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించే సంస్థ అని అన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే స్వామి వివేకానందుల సందేశాన్ని ఆచరణలో పెట్టాలని సూచించారు.దేవకి వాసుదేవరావు మాట్లాడుతూ, 2012లో స్వామి వివేకానందుల స్ఫూర్తితో సంస్థను ప్రారంభించామని తెలిపారు. పూజ్య స్వామి శితికంఠానందజీ మహరాజ్ మార్గదర్శకత్వం, మిత్రులు, సేవాభావం కలిగిన సహచరుల సహకారంతో గత 13 సంవత్సరాల్లో ఖమ్మం జిల్లాతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన 50 వేల మందికి పైగా యువతకు జీవన నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసం, ఉపాధి ఆధారిత శిక్షణలు అందించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సుంకు బాలచందర్, వి ఐ హెచ్ ఈ వ్యవస్థాపకులు, దేవకి వాసుదేవరావు, సంస్థ కార్యదర్శి చంద్రశేఖర్, జయంత్ పటేల్, కేశవ్‌లాల్ పటేల్, బోనాల రామకృష్ణ, కాళ్ల పాపారావు, మేళ్లచెరువు వెంకటేశ్వర్లు, శ్రీ రామకృష్ణ విద్యాలయం ప్రధానాచార్యులు సంతోష్ గౌతమ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రముఖులు పాల్గొన్నారు.