21 July, 2026 | 2:45 AM

మాజీ సభాపతి దుద్దిళ్ల శ్రీపాదరావు సహోదరి కన్నుమూత

20-07-2026 09:08 AM

మంథని, జూలై 20(విజయక్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సభాపతి స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు(Former Speaker Duddilla Sripada Rao) సహోదరి, మంథని మాజీ సర్పంచ్ స్వర్గీయ సువర్ణ చంటయ్య  సతీమణి శ్రీమతి సువర్ణ వనమాల (91) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం సుమారు 3 గంటల ప్రాంతంలో ఆమె తుదిశ్వాస విడిచారు.

సువర్ణ వనమాల మరణవార్త తెలిసిన వెంటనే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు విచారణ వ్యక్తం చేశారు ఆమె లేని లోటు పూడ్చలేనిదని అన్నారు. మంథని ప్రాంత ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, వివిధ పార్టీల నేతలు, సామాజిక సేవకులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె అంతిమయాత్ర జూలై 21 (మంగళవారం) ఉదయం 6 గంటలకు మంథనిలోని వారి స్వగృహం రావుల చెరువు కట్ట నుండి ప్రారంభమై, గోదావరి తీరంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సువర్ణ వనమాల ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.