20 July, 2026 | 9:41 PM

తెలంగాణ ఉద్యమకారులకు స్థలం కేటాయించాలి

20-07-2026 02:48 AM
  1. 250 గజాల స్థలమివ్వాలని డాక్టర్ పిడమర్తి రవి డిమాండ్ 
  2. కేకే కమిటీ ఏర్పాటును స్వాగతించిన ఓయూ జేఏసీ నేతలు

సికింద్రాబాద్, జూలై 19 (విజయక్రాం తి): తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, గుర్తింపుకార్డు, పింఛన్ కల్పించాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థా పకు లు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్  డాక్టర్ పిడమర్తి రవి ప్రభుత్వాన్ని కోరారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆదివారం తెలం గాణ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేకే కమిటీ ఏర్పాటు చేయడాన్ని స్వాగతి స్తున్నట్లు తెలిపారు. అయితే ఉద్యమకారుల సంక్షేమానికి సంబంధించిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు.

అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ ఆరట్స్ కాలేజ్ వేదికగా తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వ హించిన మీడియా  సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1969 తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ భాగస్వా మ్యం చేసుకుని భవిష్యత్ కార్యా చరణను రూపొందిస్తా మని చెప్పారు. తెలంగాణ ఉద్యమా నికి సేవలందించిన వారందరికీ తగిన గు ర్తింపు, గౌరవం దక్కేలా ఉద్యమాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేఏ సీ నాయకులు అల్లుడు జగన్, రాస వెంకట్, నవీన్‌యాదవ్, సాంబశివగౌడ్, వేల్పుల కు మార్, శంకర్ నాయక్, నాగరాజ్ గౌడ్, శ్రీశైలం గౌడ్, సంపత్, అంజి బాబు, కృష్ణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.