చిన్నారికి ఆర్థిక సాయం అందజేసిన పిఎసిఎస్ మాజీ చైర్మన్ జాలే నరసింహారెడ్డి
10-04-2026 08:21 PM
దేవరకొండ,(విజయక్రాంతి): దేవరకొండ పట్టణంలో జంగాలకాలనీ కి చెందిన ప్రవీణ్ కుమార్ కూతురు దువ్వ భావన 5 సంవత్సరాలు అనే చిన్నారి కి గత 15 రోజుల క్రితం ఆపేండెక్స్ ఆపరేషన్ చేయడం జరిగింది. కడుపులో మొత్తం ఇన్ఫెక్షన్ అవ్వడం తో పేగు బయటికి పెట్టడం జరిగింది. చిన్నారికి ఖర్చుతో కూడుకున్న వైద్యం కావడంతో పాప తండ్రి ప్రవీణ్ కుమార్ జాలే నరసింహ రెడ్డి సాయం కోసం వారి ఆఫీసుకు వెళ్లి చిన్నారి పరిస్థితిని తెలిపి వారిని సహాయం కోరగా రూ.10 వేలు సహాయం అందించారు. ఆపదలో ఉన్న తమను ఆదుకున్నందుకు ప్రవీణ్ కుమార్ కుటుంబ సభ్యులు జాలా నరసింహారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.




