మొక్కజొన్నను సత్వరమే రవాణా చర్యలు చేపట్టాలి
DCMS మాజీ చైర్మన్, పాల్వంచ సొసైటీ చైర్మన్ కొత్వాల
ఉల్వనూరులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం సందర్శన
పాల్వంచ,(విజయక్రాంతి): రైతులు అకాల వర్షాలతో ఇబ్బంది పడకుండా మార్కెఫెడ్ అధికారులు మొక్కజొన్న కేంద్రాల నుండి త్వరతగతిన గోడౌన్ లకు పంపేలా రవాణా చర్యలు చేపట్టాలని పాల్వంచ సొసైటీ చైర్మన్, రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. శనివారం పాల్వంచ మండలం పరిధిలోని ఉల్వనూరులో పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని కొత్వాల సందర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అకాల వర్షాలతో కేంద్రాల్లోని మొక్కజొన్న కుప్పలు తడుస్తున్నాయనీ, దాని వలన మొక్కజొన్న గింజలు ఫంగస్ చేరి, నల్లబడుతున్నాయన్నారు. దాని వలన మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం వుందన్నారు. మార్కెఫెడ్ అధికారులు లారీల యాజమాన్యంతో మాట్లాడి మొక్కజొన్నలను సూచించిన గోడౌన్ వద్దకు చేర్చేలా చర్యలు* తీసుకోవాలని మార్కెఫెడ్ అధికారులను కోరారు.






