16-02-2026 05:36:56 PM
భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం కంచర్ల గ్రామంలో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వయంభూ లింగమైన నాగిరేశ్వర దేవాలయం వద్ద వెంకీ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. శివరాత్రి వంటి పవిత్రమైన రోజున సేవాభావంతో అన్నదానం చేయడం ద్వారా సమాజానికి మేలు చేకూరుతుందనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా భక్తులు, గ్రామస్తులు, పరిసర ప్రాంతాల ప్రజలకు భోజనం అందించారు. కార్యక్రమ ఏర్పాట్లను యువత సమిష్టిగా నిర్వహిస్తూ స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వెంకీ ఫ్రెండ్స్ సభ్యులు పాల్గొన్నారు