6 May, 2026 | 5:35 PM

Breaking News

సామల వారి వివాహ వేడుకకు కాంగ్రెస్ అధ్యక్షుడు గుర్నూలే నారాయణ హాజరు   •   కోనరావుపేట పీఏసీఎస్ నూతన పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   గ్యాస్, పెట్రోల్ ధరలు తగ్గించాలి… సీపీఐ ధర్నా   •   పంట సాగుపై రైతులకు అవగాహన   •   కోనరావుపేటలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు –అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నాగండ్ల దీపక్ చౌదరి   •   పిఏసిఎస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఏగుల నరసింహులు,వైస్ చైర్మన్   •   కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు నీడ కల్పించాలని ఇందిరమ్మ పథకం   •   రైతుల సేవకు పున:రంకితమవుతా   •   రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి   •  

పూల నవ్వు నెయ్యం

09-03-2026 01:52 AM

చెలిమె నీటి ప్రతిబింబంబపు 

చెలిమి లేదు లేదు !

చెట్లకు బదులు తుపాకులను

కౌగలించుకోవడం ఉంది ఉంది !

దానవ మర్యాదని కూడా గాలికొదిలేసి

అర్ధరాత్రి ముద్దుల నిద్రలని కబళించడం

డాలర్ గద్ద దాష్టీకం !

ఫోన్ మీద సోయితో పెయ్యి మీద సోయి 

మరుస్తున్న కాలంలో

కాలం కంపించింది !

దేశాల దేహాలు

డాలర్ గద్ద పీక్కు తింటుంది !

పూలు పూయడం ఆపవు

మకరందాన్ని అందించడం మానవు

మధువుని తాగి తాగిన తేనెటీగలు

మద మత్తుల మెదళ్లని

కాటెయ్యక మానవు !

పూల నవ్వే పాలనవ్వు !

ప్రాణాలకి నిత్య మల్లె దివ్వె !

యువ పాదాలు

డాలర్ వీపు చూపిస్తాయా

డాలర్ గద్దకి బుద్ధి చెబుతాయా !

పూల నవ్వు పాన్పులు పరుస్తాయా!

 ఒబ్బిని