దృశ్య కావ్యం
09-03-2026 01:51 AM
సముద్రం ఒడ్డున నిలుచుని అలలతో
అల్లికలు చేస్తున్నాము నవ్వుతూ ఇద్దరం
మనసు దారాలతో అలలు
ఒక్కసారిగా ఎగిసిపడుతూ
మా మాటల ముత్యాలను అందుకొని
తనలో కలుపుకుంటున్నాయి !
తను కదులుతూ మా పాదాలను
తడుముతూ మా నుంచి
మాటలకు ప్రాణం పోస్తుంది
అలల భాషతో భావం స్పృశిస్తూ
అంతః హృదయాన్ని తెరుస్తుంది !
అంతలోనే చీకటిని ఊడుస్తూ చంద్రవంక
అలల పెదవులపై చల్లని
ముద్దులు పెడుతుంటే
వడిని తగ్గించి నెమ్మదిస్తున్నాయి
ఈ దృశ్యాలన్నీ నా కన్నీటి కలల్లో
దృశ్యకావ్యం రాస్తున్నాయి !
గుండెల్లి ఇస్తారి




