‘వీబీ జీ రామ్ జీ’పై నేడు తొలి భేటీ
- క్యాబినెట్ సబ్ కమిటీ సమగ్ర చర్చ
- మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): వీబీ జీ రామ్ జీ చట్టం అమలుతో ప్రభావాలు, అవకాశాలు, విధానపరమైన అంశా లను సమగ్రంగా పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ ఆదివారం సచివాలయంలో సమావేశం కానుంది. ఈ సమావేశానికి క్యాబినెట్ సబ్ కమిటీకి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షత వహించనున్నారు. కమిటీ సభ్యులుగా మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వ ర్‌రావు, వివేక్ వెంకటస్వామి పాల్గొననున్నారు.
వీబీ జీ రామ్ జీ చట్టంతో గ్రామీణ ప్రాంతాలపై, ఉపాధి అవకాశాలపై, స్థానిక సంస్థలపై, అభివృద్ధి కార్యక్రమాలపై పడే ప్రభావాలను చర్చించనున్నారు. వివిధ శాఖల అభిప్రాయాలు, క్షేత్రస్థాయి పరిస్థితులు, ప్రజల అవసరాలను పరిగణనలోకి తీసుకుని తదుపరి కార్యాచరణపై కమిటీ నిర్ణయాలు తీసుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్ర ధాన లక్ష్యం గ్రామీణ ప్రజల సంక్షేమం, ఉ పాధి భద్రత, సమగ్ర అభివృద్ధి కావడంతో చట్టం అమలుకు సంబంధించిన అన్ని అం శాలను పరిశీలించి ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు అధికారవర్గాలు వెల్లడించాయి.






