ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసాలకు పాల్పడ్డ నిందితుల అరెస్టు
శేరిలింగంపల్లి,జూన్ 20 (విజయక్రాంతి):సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు క్రైమ్ నం. 1053/2026 ఆన్లైన్ ట్రేడింగ్ మోసం కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. మ్యూ ల్ బ్యాంక్ ఖాతాలు తెరిచి, సైబర్ మోసాల నుంచి వచ్చిన అక్రమ నగదును తరలించడంలో ఇద్దరు ప్రధాన పాత్రదారులు ఉన్నారు.అరెస్టు అయిన వారిలో రాపర్తి గౌతమ్, సేనాపతి పెంటయ్య, బోడాల సాయి కుమార్, మురపాకల కుమార్, విజ్జిపు సత్యనారాయణ, మంత్రి సాయి కుమార్, ఉట్ల సత్యనారాయణలు ఉన్నారు.
వీరు విశాఖపట్నం, హైదరాబాద్ ప్రాంతాలకు చెందినవారు.నిందితులు బ్యాంక్ ఖాతాలు సప్లై చేసి, నగదు సేకరించి, రవాణా చేసి వ్యవస్థీకృత సైబర్ ముఠాలకు మనీ లాండరింగ్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. ప్రధాన నిందితుడు సేనాపతి గణేష్తో సహా మిగతా వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.బ్యాంక్ ఖాతాలు, ఓటిపిలు, యూపీఐ పిన్లు ఎవరికీ ఇవ్వవకూడదని. అనుమానాస్పద లావాదేవీలపై 1930 టోల్ఫ్రీ నంబర్కు లేదా http://cybercrime.gov.in పోర్టల్లో ఫిర్యా దు చేయాలని సైబర్ క్రైమ్ డిసిపి సాయి మనోహర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.






