10 April, 2026 | 10:10 PM

విద్యుత్ శాఖ కాంపౌండ్ లో అగ్నిప్రమాదం

10-04-2026 08:08 PM

మంటలు ఆర్పిన ఫైర్ సిబ్బంది

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ 33/11 కెవి సబ్ స్టేషన్ ప్రాంగణంలో అగ్నిప్రమాద సంఘటన చోటుచేసుకుంది .కాంపౌండ్ గేట్ కు సమీపంలో చెత్తాచెదారం పోగై ఉండడం వల్ల తీవ్ర ఎండ ప్రభావానికి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు వెంటనే స్పందించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది

సకాలంలో స్పందించి మంటలు ఆర్పి వేయడంతో ఘోర ప్రమాదం తప్పినట్లు అయిందని స్థానికులు వాపోయారు. స్థానికంగా కాంపౌండ్ పక్కనే నివాసం ఉంటున్న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సకారం శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకొని సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, సబ్ స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే పక్కనే పెట్రోల్ బంకు, స్థానికులు నివాసం ఉంటున్నారని ఆయన సిబ్బందికి సూచించారు.