25 June, 2026 | 2:29 AM

హరితహారం చెట్లు నరికినందుకు జరిమానా

25-06-2026 12:04 AM

బోధన్, జూన్ 24 (విజయ క్రాంతి): బోధన్ మండలం ఊట్పల్లి గ్రామ పంచాయతి పరిధిలో హరిత హారంలోని 14 మొక్కలను నరికినందుకు  రెవెన్యూ ప్లాంటేషన్ చెట్లు నారికినందుకు 14000/- రూపాయలు జరిమానా విధించినట్టు కార్యదర్శి పృద్విరాజ్ తెలిపారు. ఊట్పల్లి నుండి మోస్రా వెళ్లే ప్రధాన రహదారి పక్కన హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. పెరిగిన చెట్లను వ్యక్తి నరికివేసి వరి పంట సాగు చేశారు. అధికారుల దృష్టికి రావడంతో పంచనామ నిర్వహించి సదురు వ్యక్తికి జరిమానా విధించారు.