25 June, 2026 | 1:19 AM

డ్రగ్స్ వ్యతిరేకతపై సత్వ నాలెడ్జ్ సిటీలో అవగాహన సదస్సు

25-06-2026 12:07 AM

శేరిలింగంపల్లి, జూన్ 24 (విజయక్రాంతి): అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన వారోత్సవాల్లో భాగంగా రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్వ నాలెడ్జ్ సిటీ సాఫ్ట్వేర్ భవనంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ (ఐపీఎస్) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత జీవితాలు ఎలా దెబ్బతిన్నాయో, కుటుంబాలు, సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను వివరంగా వివరించారు.యువత ఐటీ ఉద్యోగులు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలి.

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణంకోసం కృషి చేయాలని డీసీపీ రితిరాజ్ పిలుపునిచ్చారు. అనంతరంమత్తు వద్దు మంచి భవిష్యత్తు ముద్దు‘అనే సందేశాలను బ్యానర్లు,పోస్టర్లు ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు. కార్యక్రమంలో మాదాపూర్ ఏసీపీ సి.హెచ్. శ్రీధర్, రాయదుర్గం సీఐ వెంకన్న, డీఐ భూపతి తదితర పోలీసు అధికారులు, ఐటీ సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు.