15 June, 2026 | 2:21 AM

లింగాపూర్ గ్రామంలో ముగిసిన చిరుతల రామాయణం

15-06-2026 01:09 AM

శంకరపట్నం, జూన్ 14 (విజయ క్రాంతి): శంకరపట్నం మండల పరిధిలోని లింగాపూర్ గ్రామంలో గత నాలుగు రోజులుగా భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న ’చిరుతల రామాయణ’ ప్రదర్శనలు ఆదివారం ముగిశాయి. లింగాపూర్ గ్రామానికి చెందిన కళాకారులు రామాయణంలోని వివిధ ఘట్టాలలో తమ అద్భుత నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. అనంతరం కళాకారులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక పర్యవేక్షకులు కోడూరు తిరుపతి, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.