15 June, 2026 | 1:09 AM

తాపీ మేస్త్రీల సమస్యల పరిష్కారానికి కృషి

15-06-2026 12:00 AM

పటాన్చెరు ఎమ్మెల్యే జీఎంఆర్

అమీన్పూర్, జూన్ 14: పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని భవన నిర్మాణ కార్మికులు, తాపీ మేస్త్రిల సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చె రు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపా రు. ఆదివారం అమీన్పూర్ డివిజన్ పరిధిలో తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ కార్మికు ల ట్రేడ్ యూనియన్, తాపీ మేస్త్రి యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమా వేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్చెరు నియోజకవర్గంలో భవన నిర్మాణ కార్మికు లు, తాపీ మేస్త్రీల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. అతి త్వరలో తాపీ మేస్త్రీలు, భవన నిర్మాణ కార్మికుల కోసం స్థలం కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అ మీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, మా జీ జెడ్పిటి సుధాకర్ రెడ్డి, అమీన్పూర్ మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి, మా జీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, సంఘం అధ్యక్షులు నాగేందర్, తదితరులు పాల్గొన్నారు.