ముగిసిన కల్నల్ సంతోష్‌బాబు
- మెమోరియల్ చెస్ టోర్నమెంట్ సెలక్షన్స్
- విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన డిప్యూటీ మేయర్ సునీల్ రావు
ముకరంపుర, జూన్ 14(విజయ క్రాంతి) చదరంగం ఆట మాత్రమే కాదని మేదస్సుకు ప దును పెట్టి ఏకాగ్రత వ్యూహాత్మక ఆలోచనలను పెంపొందించే ఒక అద్భుతమైన క్రీడ అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ లోని భగత్ నగర్ చైతన్య యూత్ క్లబ్ వేదికగా ‘ఆల్ ఇండియా ఫిడ్ రేటెడ్ రాపిడ్ చెస్ టోర్నమెంట్ సెలక్షన్స్‘ ఆదివారం రోజు ఘనంగా ముగిశాయి. వీరుడు, కల్నల్ సంతోష్ బాబు మె మోరియల్ కమిటీ ఆధ్వర్యంలో, విశ్వనాథ్ చెస్ అకాడమీ వారు నిర్వహించిన చదరంగం పోటీల ముగింపు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
చదరంగం పోటీల్లో అధ్భుత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు తన చేతుల మీదుగా ట్రోఫీలు, ప్రశంసా పత్రాలను అందజేసి... క్రీడాకారులను అభి నందించారు.ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ... చదరంగం పోటీలు క్రీడకారుల్లో వ్యూహాత్మక ఆలోచనలను మేదస్సును పెంచడంలో ఎంతో దో హదపడుతాయన్నారు. కరీంనగర్ నగరం నుండి భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయి గ్రాండ్ మాస్టర్లుగా ఎదగాలని...
చదరంగంలో ప్రతిభను కనబరిచి కరీంనగర్ నగరానికి మంచి గుర్తింపు తీస్కోచ్చేలా క్రీడాకారులు ఎదగాలన్నారు. దేశ రక్షణలో వీరోచితంగా పోరాడి అమరుడైన కల్నల్ సంతోష్ బాబు జ్ఞాపకార్థం ఇలాంటి జాతీయ స్థాయి ఎంపిక పోటీలను విశ్వనాథ్ చెస్ అకాడమీ వారు కరీంనగర్లో నిర్వహించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులోనూ క్రీడాకారులకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విశ్వనాథ్ చెస్ అకాడమీ నిర్వాహకులు, చైతన్య యూత్ క్లబ్ ప్రతినిధులు, క్రీడాకారులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






