29 August, 2026 | 12:37 PM

Breaking News

ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ   •   పెంజర్లలో అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్   •   స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం   •   ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన కాంగ్రెస్ నాయకులు   •   క్రీడలతో యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందుతుంది   •   మహానగరంలో గంజాయి చాక్లెట్ల కలకలం.. 5 వేలకు పైగా సీజ్   •   కుల గణన శాస్త్రీయంగా జరగాలి   •   మంత్రి పర్యటనకు చురుకుగా ఏర్పాట్లు   •   45వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‎ను ప్రారంభం   •   బాలల హక్కులపై అవగాహన.. ఇబ్బందులు ఉంటే ఫోన్ కాల్ తో పరిష్కారం   •  

పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక

29-06-2026 01:32 AM

సందడిగా శ్రీనివాస హైస్కూల్ గెట్ టు గెదర్

కరీంనగర్, జూన్ 28(విజయక్రాంతి) : పూర్వ విద్యార్థులు ఒక చోటుకు చేరుకున్నారు. కరీంనగర్‌లోని శ్రీనివాస హైస్కూల్‌కు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం నాటి సమ్మేళనంలో సందడి చేశారు. 1998 లో పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యా ర్థు లు 27 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒకరినొకరు కలుసుకున్నారు. రాజీవ్‌చౌక్‌లోని ప్రముఖ హోటల్ ఇందుకు వేదికైంది. దాదా పు 35 మంది విద్యార్థులు ఒక దగ్గరకు చేరి గత స్మృతులను గుర్తుకు చేసుకున్నారు. బా ల్యం నాటి తీపి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

ఆనాడు విద్యా బుద్దులు నేర్పించిన ఉప్యాధాయుల సేవలను యాదికి చేసుకుం టూ వారికి కృతజ్ఞతలు తె లిపారు. పాఠశాల దశ నుంచి కాలేజీ, ఉద్యోగాలు, కుటుంబసభ్యుల విషయాలను ఒకరికొకరు పంచుకు న్నారు.  ఉపాధ్యాయులు విశ్వనాథ్, వేణుమూర్తిని  ఘనంగా సన్మానించారు. ఆ తర్వాత మళ్లీ కలుసుకుందామంటూ ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకున్నారు.