8 May, 2026 | 2:05 AM

వర్షం నీటిని తొలగిస్తున్న రైతులు

08-05-2026 12:06 AM

కురిసిన వర్షం రైతుల ఆందోళన

నిర్మల్ , కుబీర.మే 7( విజయ క్రాంతి): నిర్మల్ జిల్లాలో గురువారం కురిసిన వర్షం అన్నదాతకు మరింత నష్టాన్ని తెచ్చిపెడుతోంది. ఇప్పటికి యాసంగిలో సాగుచేసిన మొక్కజొన్న, జొన్న. పొద్దుతిరుగుడు, వరి పంటలు కోతలు కోసి పంటను కొనుగోలు కేంద్రంలో నిలువ చేయగా గురువారం కురిసిన వర్షానికి తడిసిపోయింది. జిల్లాలను తాండూర్ కుబీర్ బైంసా లోకేశ్వరం ముధోల్ బాసర్ కుంటాల నర్సాపూర్ సారంగాపూర్ నిర్మల్ రూలర్ సోన్ మండలాల్లో గంటసేపు బలమైన కూడిన వర్షం కురిసినట్టు రైతులు తెలిపారు.

పంటపై వర్షం నీరు పడకుండా రైతులు టార్ఫిన్ లు కప్పినప్పటికీ బలమైన కాల్పుల వల్ల అవి లేచిపోయినట్టు రైతులు తెలిపారు. పంటలు కాపాడుకునేందుకు రైతులు పంట కలాల్లో నానా అవస్థలు పడ్డారు. ప్రభుత్వం కొనుగోళ్లలో జాప్యం చేయడం వలన చేతికొచ్చిన పంట తడిసిపోతుందని రైతులు ఆవేదన చెందారు.

తాండూర్ మండల కేంద్రంలో రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు అధికారులు వచ్చి పంట కొనుగోలు చేపడతామని హామీ ఇవ్వడంతో ఆందోళన నిర్మించారు. వర్షం వల్ల పంట తడిసిపోతే రంగు మారి నాణ్యత పేరుతో ప్రభుత్వం కొనుగోలు నిలిపివేసే అవకాశం ఉన్నందున రైతులకు వెంటనే న్యాయం చేయాలని జిల్లా రైతులు కోరుతున్నారు. ఆయా మార్కెట్లో ఉన్న ధాన్యం తడిసిపోవడంతో రైతులు దాన్ని ఆరబెడుతున్నారు.