calender_icon.png 12 February, 2026 | 8:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యవసాయంలో రైతులు నూతన ఒరవడి నేర్చుకోవాలి

12-02-2026 07:06:33 PM

- నిరంతర ఆదాయం వచ్చే పంటలపై మొగ్గు చూపాలి 

- బయోచార్ బొగ్గు తయారీ విధానాన్ని రైతులకు వివరించిన కలెక్టర్

టేకులపల్లి,(విజయక్రాంతి): వ్యవసాయంలో రైతులు నూతన ఒరవడి నేర్చుకొంటూ, నిరంతర ఆదాయం వచ్చే పంటలపై మొగ్గు చూపాలని, బయోచార్ బొగ్గు తయారీ విధానాన్ని రైతులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. టేకులపల్లి మండలం బేతంపూడి గ్రామపంచాయతీలో గురువారం బయోచార్ (పత్తి కట్టేనుండి బొగ్గు తయారీ) తయారీ  విధానం, పంట పొలాలకు బయోచార్ ఉపయోగo గురించి బేతంపూడి, తొమ్మిదవ మైలు తండా గ్రామాల రైతులకు, ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి  హాజరై  రైతులకు అవగాహన  కల్పించారు. 

రైతు భద్రం పొలంలో బయోచార్ బొగ్గు తయారీ విధానాన్ని రైతులకు వివరించారు. రైతు పొలంలో  ఏర్పాటుచేసిన అజోళ్ళ పెంపకాన్ని పరిశీలించి దాని ఉపయోగాలు రైతులకు వివరించారు. రైతులు తెలివిగా వ్యవసాయం పద్ధతులు నేర్చు కోవాలని ప్రతి రైతు కుటుంబానికి 3 నుండి 4  పద్ధతుల ద్వారా నిరంతరం ఆదాయం వచ్చే మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా కౌజు పిట్టల పెంపకం, మునగ తోట పెంపకం, చేప పిల్లల పెంపకం, పుట్టగొడుగుల పెంపకం, తేనెటీగల పెంపకం, కూరగాయల పెంపకం, మేకల పెంపకం లాంటి వనరుల ద్వారా ఆదాయం పొందే అవకాశం ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గౌరవ అడిషనల్ కలెక్టర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి విద్యాచందన, ఎంపీడీవో  బైరు మల్లేశ్వరి, తాహాసిల్దార్ లంకా వీరభద్రం,బేతంపూడి, తొమ్మిదో మైలు తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ లు  ఊకే సునీత, బానోతు పూర్ణ, ఎంపీఓ గణేష్ గాంధీ, మండల వ్యవసాయ అధికారి అన్నపూర్ణ, డిఆర్డిఏ కన్సల్టెంట్ రాజు, అదనపు కార్యక్రమ అధికారి కాళంగి శ్రీనివాస్, ఇంజనీర్ లు తిరుపతయ్య, గణేష్, ఉపాధి హామీ సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బంది, కార్యదర్శులు ప్రజలు రైతులు పాల్గొన్నారు.