12-02-2026 07:04:04 PM
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ సుబేదారి రెడ్ క్రాస్ భవన్‌లో గురువారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హనుమకొండ శాఖ ఆధ్వర్యంలో 30 మంది టిబి (క్షయ) వ్యాధిగ్రస్తులకు ఉచిత న్యూట్రిషన్ కిట్లను రెడ్ క్రాస్ సొసైటీ పాలకవర్గ సభ్యుల చేతుల మీదుగా బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ పి. విజయచందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున 30 మంది టిబి బాధితులకు ఉచిత న్యూట్రిషన్ కిట్లు పౌష్టికాహార పదార్థాలు,
కోడిగుడ్లు, నిత్యావసర సరుకులు దాతలు ఇనగాల చారిటబుల్ ట్రస్ట్ కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, వాసవి ఫెర్టిలిటీ హాస్పిటల్ డా. రాకేష్ వాసవి రెడ్డి, వంగ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ డా. వంగ హేమంత్ రెడ్డిల సహకారంతో గత ఆరు నెలల నుండి పంపిణీ చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పాలకవర్గ సభ్యులు ఇ.వి శ్రీనివాసరావు, జిల్లా వైస్ చైర్మన్ పెద్ది వెంకటనారాయణ, జిల్లా పాలకవర్గ సభ్యులు పుల్లూరి వేణుగోపాల్, టిబి బాధితులు, టిబి విభాగం సిబ్బంది, రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.