13 April, 2026 | 10:34 PM

రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోండి

13-04-2026 09:04 PM

కేంద్రాన్ని  ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్

ఎర్రుపాలెం,(విజయక్రాంతి): మధిర మెప్మా ఆధ్వర్యంలో  మార్కెట్ యార్డ్ నందు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని సుజాతతో కలిసి ప్రారంభించిన మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ రైతులకు న్యాయం చేయాలని ఉద్దేశంతో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని ఆయన తెలిపారు.

రైతుకి నష్టం కలిగించకూడదని రైతుని రాజు చేయాలని ఉద్దేశంతో రైతులకు మేలు కల్పించడం లక్ష్యంతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు గార్ల చొరవతో ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ కోనా ధని కుమార్ మున్సిపల్ కమిషనర్ సంపత్, 22వ వార్డు కౌన్సిలర్ నాగార్జున  కాంగ్రెస్ నాయకులు రామనాథం గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.