13 April, 2026 | 10:33 PM

సిరిసిల్ల పురపాలక సంఘం కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక

13-04-2026 09:01 PM

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): సిరిసిల్ల పురపాలక సంఘం కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక సోమవారం ఉదయం 11.00 గంటలకు చైర్‌పర్సన్ అధ్యక్షతన పురపాలక సంఘ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సాఫీగా పూర్తయ్యింది. ఈ సమావేశంలో కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా సభ్యులను ఎన్నుకున్నారు. జనరల్ నంది శంకర్, జనరల్ కొండ అనూష శ్రీనివాస్ మైనారిటీ మగ సయ్యద్ సోహెల్  మైనారిటీ తస్లీమ్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగిందని, అన్ని నిబంధనలు పాటిస్తూ సమావేశాన్ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికైన సభ్యులకు పురపాలక చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి కౌన్సిల్ టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య గూడూరి ప్రవీణ్ మంచే శ్రీనివాస్ బింగీ మ్యాన రవి సభ్యులు  శుభాకాంక్షలు తెలియజేశారు.