అరైవ్ అలైవ్‌తో రోడ్డు భద్రతపై అవగాహన
13-04-2026 09:06 PM
ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): ఇల్లందులో ఆర్టీసీ సిబ్బంది, పోలీసుల ఆధ్వర్యంలో “Arrive Alive” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌హెచ్‌ఓ తాటిపాముల సురేష్ పాల్గొని మాట్లాడారు. రోడ్డు నిబంధనలు పాటించాలని ప్రజలతో ప్రమాణం చేయించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం తప్పనిసరి అని, మద్యం సేవించి వాహనం నడపకూడదని, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించవద్దని సూచించారు. ఆర్టీసీ డిపో ఇన్‌చార్జి సునీత మాట్లాడుతూ అతివేగం, హెల్మెట్ వినియోగం లేకపోవడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. పాదచారులు జీబ్రా క్రాసింగ్ వాడాలని, బస్సుల ముందు నుంచి రోడ్డు దాటవద్దని సూచించారు. హెల్మెట్ ప్రాముఖ్యతను ప్రదర్శన ద్వారా వివరించారు. కార్యక్రమంలో ప్రజలు పాల్గొన్నారు.




