రైతులకు నిండా మోసమే
- కాంగ్రెస్‌వన్నీ అబద్ధాలే
- మార్కెట్‌కు రైతులు తెచ్చిన ధాన్యం కొనుగోళ్లలో జాప్యం
- వడదెబ్బతో యార్డులోనే రైతులు చచ్చిపోతున్నా చలనం లేదు
- ఎంపీ ఈటల రాజేందర్ మండిపాటు
- నిర్మల్ జిల్లాలో ‘రైతు గోస భరోసా’ యాత్ర
ఖానాపూర్, మే 28 (విజయక్రాంతి): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా మోసం చేస్తున్నదని, అధికా రంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని అబద్ధాలే మాట్లాడుతూ రైతులను విస్మరి స్తున్నదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మార్కెట్‌కు రైతులు తెచ్చి న ధాన్యం కొనుగోళ్లపై జాప్యంతో యార్డులోనే వడదెబ్బతో రైతులు చచ్చిపోతున్నా ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. బీజేపీ నిర్వహిస్తున్న రైతు గోస బీజేపీ భరోసా యాత్ర గురువారం నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం మండలా ల్లో నిర్వహించారు.
ఖానాపూర్ మార్కెట్ యార్డును సందర్శించిన ఈటల రాజేందర్.. రైతుల సమస్యలను తెలుసుకు న్నారు. అనంతరం ఆయన మాట్లాడు తూ.. గత ప్రభుత్వం ఇదే విధంగా రైతులను మోసం చేయడంతో ఆ పార్టీని అథఃపాతాళానికి తొక్కేశారని, ప్రస్తుత కాంగ్రెస్ పాలన అంతకంటే దారుణంగా ఉన్నదని, ఇదంతా రైతులు అన్ని గమనిస్తున్నారని అన్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను రైతులు మార్కె ట్ యార్డుకు తరలిస్తే ప్రభుత్వం దాన్ని కొనుగోలు చేయకుండా తాత్సారం చే యడం దారుణమన్నారు.
రైతుల కన్నీటికి కారణం కాంగ్రెస్సేనని విమర్శించారు. అనేకచోట్ల మార్కెట్ యార్డుల్లోనే వడదెబ్బ తగిలి రైతులు చచ్చిపోతున్నా ప్రభుత్వానికి చలనం లేదని విమర్శించారు. రైతులు పండించిన ప్రతి గింజను కొంటామని అబ ద్ధాలు పలుకుతూ, క్విం టాల్‌కు అదనంగా కోత విధిస్తూ రైతు ను నిండా ముంచుతున్నారని మండిపడ్డారు. 40 రోజులకు పైగా రైతులు మార్కెట్ యార్డ్‌లో పడిగాపులు కాస్తే సంచులు ఇవ్వడంలేవని, రవాణాకు వాహనాలు సమకూ ర్చడంలే దన్నారు.
సరైన వసతులు కల్పించక రైతులను నానా అవస్థలకు గురి చేస్తున్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డికి ధైర్యం ఉంటే మార్కెట్ యార్డుకు వచ్చి రైతుల పరిస్థితి చూడాలని సవాల్ చేశారు. ఇప్పటికైన ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచి, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈటల రాజేందర్ వెంట నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, రాకేష్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ఉపేందర్, మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్, సర్పంచులు బక్కశెట్టి వెంకటరమణ, మల్లేష్ యాదవ్ ఉన్నారు.
రైతులు పండించిన ప్రతి గింజను కొంటామ ని అబద్ధాలు పలుకుతున్నారు. క్వింటాల్‌కు అదనంగా కోత విధిస్తూ రైతును నిం డా ముంచుతున్నారు. 40 రోజులకు పైగా రైతులు మార్కెట్ యార్డులలో పడిగాపులు కాస్తే సంచులు ఇవ్వడంలేదు. రవా ణాకు వాహనాలు సమకూర్చడంలేదు. సరైన వసతులు కల్పించక రైతులను నానా అవస్థలకు గురిచేస్తున్నారు. ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డికి ధైర్యం ఉంటే మార్కె ట్ యార్డుకు వచ్చి రైతుల పరిస్థితి చూడాలి. ఇప్పటికైన ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచి, రైతులను ఆదుకోవాలి.
ఎంపీ ఈటల రాజేందర్






