27 July, 2026 | 7:17 PM

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్

27-07-2026 06:30 PM

బోథ్,(విజయక్రాంతి): మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ ఇంట్లో గత 24వ తేదీన దొంగతనానికి పాల్పడిన వ్యక్తి కృష్ణ కాంత్ జాదవ్ను అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు బోత్ ఎస్ఐ పురుషోత్తం తెలిపారు. ఈనెల 24న బాధితురాలు ఇంటికి తాళం వేసి బయట పని నిమిత్తం వెళ్లిపోయిందని అయితే విషయం గమనించిన నిందితుడు తాళం పగలగొట్టి 5000 రూపాయల నగదు దొంగతనానికి పాల్పడ్డట్టు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా ఈనెల 26న దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి ని అదుపులోకి తీసుకొని విచారించామన్నారు. తనకు కూలీ పని ద్వారా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో దొంగతనానికి పాల్పడ్డట్టు ఒప్పుకోవడం జరిగిందన్నారు. వద్దనుండి 5000 రూపాయలు నగదు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు పంపించినట్లు ఎస్సై వి పురుషోత్తం పేర్కొన్నారు