27 July, 2026 | 8:12 PM

Breaking News

ఉరుమడ్ల మహిళల సత్తా.. రాష్ట్ర స్థాయి త్రోబాల్ పోటీలకు అర్హత.   •   విత్తనాల మేళాను సద్వినియోగం చేసుకోండి   •   తరుగు పేరుతో రూ.71 లక్షల అవినీతి   •   మండల సమావేశాన్ని బహిష్కరించిన ఫీల్డ్ అసిస్టెంట్లు   •   దోరకుంటలో వన మహోత్సవం   •   చిన్నకాపర్తి చెరువులకు పిలాయిపల్లి కాలువ నీరు అందించాలి   •   ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకం   •   మూడేళ్లుగా కూలిన హాస్టల్ గోడ.. పునర్నిర్మించాలని పీడీఎస్‌యూ డిమాండ్   •   దళితుడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి   •   సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా చేతికి రీసెంట్ బ్లాక్‌బస్టర్ 'చెన్నై లవ్ స్టోరీ' డిజిటల్, శాటిలైట్ హక్కులు   •  

సర్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలి

27-07-2026 07:13 PM

ఎమ్మార్వోలు, బిఎల్ఏలతో ప్రభుత్వ విప్ వేముల వీరేశం సమీక్ష సమావేశం

చిట్యాల,(విజయ క్రాంతి): సర్ (Special Intensive Revision) ప్రక్రియలో భాగంగా నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సోమవారం సమీక్ష సమావేశాలు నిర్వహించారు.నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలకు చెందిన ఎమ్మార్వోలు , బిఎల్ఏ లతో విడివిడిగా జరిగిన సమావేశాల్లో సర్ ప్రక్రియ పురోగతిపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ... సర్ ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని అధికారులకు, పార్టీ ప్రతినిధులకు సూచించారు. అలాగే ఎలాంటి తప్పులు, లోపాలు తలెత్తకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రజలకు అవసరమైన అవగాహన కల్పిస్తూ నిర్ణీత గడువులోపు సర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఈఆర్ఓ  లెవల్ కోఆర్డినేటర్ చామల శ్రీనివాస్, మండల, టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.