27 July, 2026 | 7:23 PM

పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ

27-07-2026 06:28 PM

కొల్చారం: కొల్చారం మండలంలోని పైతర గ్రామ పంచాయతీ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి రూ.20 లక్షల విలువైన ప్రమాద బీమా (ఇన్సూరెన్స్) పథకాన్ని అమలు చేసి బీమా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన గ్రామ సర్పంచ్ యాబన్నగారి రవితేజ రెడ్డి, గ్రామ పంచాయతీ కార్మికులు ప్రజా సేవలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి భద్రత కోసం ప్రమాద బీమా కల్పించడం ఎంతో అవసరమని అన్నారు. కార్మికుల సంక్షేమానికి గ్రామ పంచాయతీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, ఉపసర్పంచ్ సుధాకర్, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ కార్మికులు, గ్రామ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.