27 July, 2026 | 7:20 PM

సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు

27-07-2026 06:25 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఘట్ కేసర్ సర్కిల్, ఎదులాబాద్ డివిజన్ పరిధిలోని ఘనపురం, లింగాపురం గ్రామాలలో జరుగుతున్న సర్ పక్రియను  మేడ్చల్  జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, ఎదులాబాద్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు సామల అమరేందర్  పరిశీలించి సర్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఎల్ఏలు, బిఎల్ఓలతో సమన్వయయం చేసుకుని ప్రజలకు సర్ ప్రక్రియపై అవగాహన కల్పించాలని, అర్హులైన ప్రతి ఓటరు తన ఓటు హక్కును కాపాడుకునేందుకు సర్ ప్రక్రియలో తమ ఓటరు వివరాలను తప్పనిసరిగా నమోదు చేసే విధంగా చూడాలన్నారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచులు ననావత్ రూప్ సింగ్ నాయక్, వేముల మమత గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాయరు విశ్వనాధం, మాజీ ఉప సర్పంచ్ లు వేముల సత్తయ్య గౌడ్, వేముల పరమేష్ గౌడ్, నాయకులు వేముల రాజు గౌడ్, మాజీ గుర్జకుంట నర్సింహా, మెట్టు రమేష్, వేముల శంకర్ గౌడ్, ననావత్ సురేష్ నాయక్, బర్ల  అనిత, పైళ్ల లతరెడ్డి, పైళ్ల జంగారెడ్డి, పూస రమేష్ బిఎల్ఓలు, తదితరులు పాల్గొన్నారు.