మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆశయాలు యువతకు స్ఫూర్తి
మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్
ఘట్ కేసర్,(విజయక్రాంతి): భారత మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలను సోమవారం ఏదులాబాద్ డివిజన్ పరిధిలోని ఘనపూర్ లో ఘనంగా నిర్వహించారు. డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సామల అమర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ స్థానిక నాయకులతో కలిసి అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ... డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దేశాభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత శాస్త్రవేత్త, ఆదర్శ రాష్ట్రపతి అని కొనియాడారు. భారతదేశాన్ని శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రపంచానికి పరిచయం చేయడంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.






