ఆర్థిక సాయం అందించిన టూ వీలర్ మెకానిక్ వర్కర్స్ యూనియన్
27-07-2026 07:18 PM
నిమ్మగడ్డ రవికుమార్‌కు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.11,000 అందజేత
సత్తుపల్లి,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని సిద్ధారం రోడ్డులో నివాసం ఉంటున్న టూ వీలర్ మెకానిక్ నిమ్మగడ్డ రవికుమార్ ఇటీవల కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న టూ వీలర్ మోటార్ సైకిల్ మెకానిక్ వర్కర్స్ యూనియన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా వైద్య ఖర్చుల నిమిత్తం రూ.11,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. బాధితుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ యూనియన్ సభ్యులు తమ సంఘీభావాన్ని తెలిపారు.






