27 July, 2026 | 6:32 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

చేపలు పట్టేందుకు వెళ్లి వ్యక్తి మృతి

29-05-2026 01:38 AM

పాపన్నపేట, మే 28 : చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ నీట మునిగి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని నాగ్సాన్‌పల్లి శివారులోని చెలిమకుంటలో గురువారం చోటు చేసుకుంది. ఎస్త్స్ర శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం.. నాగ్సాన్ పల్లి గ్రామానికి చెందిన గుండు కిష్టయ్య(48) వ్యవసాయంతో పాటు చేపలు పడుతూ జీవనం సాగిస్తున్నాడు.

మంగళవారం సాయంత్రం చేపలు పట్టేందుకు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లి గ్రామ శివారులోని చెలిమ కుంట చెరువులో చేపలు పడుతుండగా కాళ్లకు వల చుట్టుకోవడంతో ప్రమాదవశాత్తూ నీట మునిగి మృతి చెందాడు. తిరిగి ఇంటికి రాలేదు.

దీంతో కుటుంబీకులు చుట్టూ పక్కల వెతికారు. గురువారం ఉదయం చెలిమకుంటలో అటుగా వెళ్లిన స్థానికులు నీటిలో మృతదేహాన్ని గమనించి పోలీసులకు, కుటుంబ సభ్యులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీయించి పోస్టుమార్టం నిమిత్తం మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుమారుడు రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.