27 July, 2026 | 8:10 PM

Breaking News

ఉరుమడ్ల మహిళల సత్తా.. రాష్ట్ర స్థాయి త్రోబాల్ పోటీలకు అర్హత.   •   విత్తనాల మేళాను సద్వినియోగం చేసుకోండి   •   తరుగు పేరుతో రూ.71 లక్షల అవినీతి   •   మండల సమావేశాన్ని బహిష్కరించిన ఫీల్డ్ అసిస్టెంట్లు   •   దోరకుంటలో వన మహోత్సవం   •   చిన్నకాపర్తి చెరువులకు పిలాయిపల్లి కాలువ నీరు అందించాలి   •   ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకం   •   మూడేళ్లుగా కూలిన హాస్టల్ గోడ.. పునర్నిర్మించాలని పీడీఎస్‌యూ డిమాండ్   •   దళితుడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి   •   సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా చేతికి రీసెంట్ బ్లాక్‌బస్టర్ 'చెన్నై లవ్ స్టోరీ' డిజిటల్, శాటిలైట్ హక్కులు   •  

ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలి

27-07-2026 07:06 PM

ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

ములకలపల్లి,(విజయక్రాంతి): ఎల్‌నినో కారణంగా లోటు వర్షపాతం నమోదు అవ్వడం వలన వరిసాగు తగ్గించి ఆ స్థానంలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని అశ్వరావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ రైతులను కోరారు. సోమవారం ములకలపల్లి రైతు వేదికలో విత్తనమేళా కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ నెల 29 వరకు ములకలపల్లి రైతు వేదికలలో విత్తనాలను విక్రయిచడం జరుగుతుందని కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న తదితర విత్తనాలను అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు.

ప్రస్తుతం ఎల్లినో ప్రభావం వల్ల భూగర్భ జలాలు,బోర్లలో నీటిమట్టం తగ్గుతున్నాయని,చెరువులు పూర్తిస్థాయిలో నిండనందున రైతులు మొత్తం విస్తీర్ణంలో వరి సాగు చేయకుండా కొంత భాగంలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించారు. తక్కువ నీటితో సాగు చేయగల పంటలైన కంది, పెసర, మినుము,పొద్దుతిరుగుడు పంటలు సాగు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులకు కంది,మినుము విత్తనాలను ఎమ్మెల్యే చేతుల మీదగా అందజేశారు.