12 March, 2026 | 12:41 AM

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

11-03-2026 07:23 PM

కుబీర్,(విజయక్రాంతి): కుబీర్ మండలంలోని పార్టీ బి ఉన్నత పాఠశాలలో బుధవారం పదో తరగతి విద్యార్థులకు వీడుకోలు సమావేశం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు మంచి మాటలతో ఉత్తీర్ణత కావాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.