రైతులకు వరి, జీలుగు విత్తనాలు అందుబాటులో ఉన్నాయి
14-06-2026 05:53 PM
పిఎసిఎస్ డైరెక్టర్ దేవలపల్లి శంకరాచారి.
నేరేడుచర్ల(విజయక్రాంతి): నేరేడుచర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో రైతులకు కావలసిన వరి విత్తనాలు, జీలుగులు అందుబాటులో ఉన్నాయిని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్ దేవులపల్లి శంకరాచారి తెలిపారు. రైతులకు వానాకాలం సీజన్ ప్రారంభం అవుతున్న సందర్భంగా రైతులకు వరి విత్తనాలు జిలుగులు కావలసిన రైతులు పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని వ్యవసాయ సహకారం సంఘం ఆఫీస్ నందు, జీలుగులు కావలసిన రైతులు వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఆన్లైన్ నమోదు చేసుకొని సహకార సంఘంలో జీలుగులు తీసుకోవాలన్నారు.జీలుగులు సబ్సిడీ ధరలో అందుబాటులో ఉన్నాయన్నారు.






