డాక్టర్ యర్రహరి కిషన్ కు బాలికా చైతన్యశ్రీ బిరుదు ప్రధానం
14-06-2026 05:56 PM
తుంగతుర్తి,(విజయక్రాంతి): తెలుగు కళా రత్నాలు సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ మరియు ఉషోదయ ఫౌండేషన్ శ్రీకాకుళం వారు సంయుక్తంగా 'బాలకార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని' పురస్కరించుకుని నిర్వహించిన ఆన్లైన్ పోటీలలో పాల్గొని బాలికే జగతిలో బంగారు భవిత అనే శీర్షికతో చక్కని సీస పద్యం రాసినందుకు తెలంగాణ రాష్ట్ర సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, డా. యర్ర హరికిషన్ అభినందిస్తూ " బాలికా చైతన్య శ్రీ " అనే బిరుదును ప్రధానం చేస్తూ ప్రశంసాపత్రం అందజేసినారు. దీనితో సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ఉపాధ్యాయ బృందం, మేధావులు, కవులు కళాకారులు, జర్నలిస్టులు, హర్షం వ్యక్తం చేశారు






