పద్మశాలీలు అన్ని రంగాల్లో రాణించాలి
కరీంనగర్ క్రేమ్: పద్మశాలీలు అన్ని రంగాల్లో రాణించాలని విద్యార్థులు ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని తెలంగాణ పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరి శ్రీనివాస్, తెలంగాణ హ్యాండ్లూమ్ మరియు టెక్స్ టైల్ చైర్మన్ దూడం వెంకటరమణ అన్నారు. రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లా పోపా ఆదర్శంగా చట్టసభల్లో పద్మశాలీలు రాజకీయంగా ఎదగలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల కష్టానికి ప్రతిభకు గుర్తింపుగా ప్రతిభ పురస్కారాలను పోపా ఆధ్వర్యంలో చేపడుతున్నారని, అలాగే ఉద్యోగులకు సేవలకు గుర్తింపుగా పద్మ రత్న పురస్కారాలు అందజేయడం సంతోషకరమన్నారు.
పద్మశాలీల కార్పొరేషన్ ద్వారా టెక్స్ టైల్ ద్వారా ప్రభుత్వం నుండి నిధులు తీసుకువచ్చేందుకు తమ వంతుగా కృషి చేస్తామన్నారు. రాజకీయంగా, సామాజికంగా పద్మశాలీలు వెనుకబడినారని, పద్మశాలీలు అన్ని రంగాల్లో రాణించాల్సిన అవసరం ఉందన్నారు. పూపా జిల్లా అధ్యక్షుడు పోలు సత్యనారాయణ పాలకవర్గ సభ్యులు జిల్లాలో ప్రతిభ పురస్కారాలు నిర్వహిస్తూ విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ప్రతిభా పురస్కారాలు పొందిన విద్యార్థులకు, ఉద్యోగులకు, రిటైర్డ్ ఆర్డీవో కుందారపు మహేశ్వర్ దంపతులను మెమొంటో శాలువాతో ఘనంగా వారు సత్కరించారు.
జర్నలిస్టులకు "పద్మ రత్న" పురస్కారాలు
మీడియా రంగంలో రాణిస్తూ పద్మశాలి కులస్తులకు సమాజానికి విశేషంగా కృషి చేస్తున్న ఇద్దరి జర్నలిస్టులను కరీంనగర్ జిల్లా పద్మశాలి అఫీషియల్ ప్రొఫెషనల్, ప్రొఫెషనల్ అసోసియేషన్ (పోపా) ఆధ్వర్యంలో తెలంగాణ పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరి శ్రీనివాస్, తెలంగాణ హ్యాండ్లూమ్, టెక్స్ టైల్ చైర్మన్ దూడం వెంకటరమణ, పోపా అధ్యక్షుడు పోలు సత్యనారాయణ చేతుల మీదుగా సీనియర్ జర్నలిస్ట్ కొండ లక్ష్మణ్, మార్త ప్రకాష్ లకు పద్మ రత్న పురస్కారాలను పద్మశాలి కళ్యాణమండపం లో ఆదివారం అందజేశారు. వీరిని శాలువాతో ఘనంగా సత్కరించి మెమొంటో ప్రదానం చేశారు. వీరి సేవలు అవసరమని వారు కొనియాడారు






