14 June, 2026 | 6:51 PM

తలారి హరికృష్ణది ముమ్మాటికీ హత్యే

14-06-2026 05:59 PM

తక్షణమే దోషులను అరెస్టు చేయాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్

తాండూరు,(విజయ క్రాంతి):   వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవన్గిగ్రామానికి చెందిన తలారి హరికృష్ణ కూలీ పనికి వెళ్లి అనుమానాస్పద స్థితిలో మరణించగా ఆయన మృతి మాత్రం ముమ్మాటికీ హత్యేనని  తాండూరు నియోజకవర్గ ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్వీనర్. కే.శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ  ఉప్పలి మల్కయ్య, చంద్రయ్య మాట్లాడుతూ... తలారి హరికృష్ణ ఏప్రిల్ 29న పని నిమిత్తం రుద్రారం గ్రామానికి వెళ్లాడు.

అదే రోజు మధ్యాహ్నం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.ఈ విషయమై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎలాంటి ఆధారాలు సేకరించలేదని,ఇప్పటి వరకు నిందితులను అరెస్టు చేయలేదన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. ఇకనైన న్యాయం జరగకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారని అన్నారు.

అదేవిధంగా పెద్దముల మండలం మంబపూర్ గ్రామానికి చెందిన యువకులు బైకులతో ఢీకొనగా యాక్సిడెంట్ కేసు నమోదు హత్యయత్నం కేసు నమోదు చేసి యువకుడు జీవితాన్ని నాశనం చేశారని, రాజకీయ నాయకుల అండదండలతో తప్పుడు కేసులు నమోదు చేసి పంపిన పెద్దముల్ ఎస్సై ని సస్పెండ్ చేయాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.