భద్రాద్రిలో నదిహారతి
భద్రాచలం, జూన్ 14, (విజయక్రాంతి): భద్రాచలంలో ప్రవహిస్తున్న పుణ్య గౌతమి మహాముని, వరప్రదాయని గోదావరి నదికి అధిక జ్యేష్ట తత్కాల అమావాస్య ఆదివారం గోదావరి నదీహారతి నిర్వహించగా వందలాది మంది భక్తులు కనులారా వీక్షించారు. ఆదివారం నాడు గోదావరి స్నాన ఘట్టాల వద్ద జరుగుతున్న నదిహారతి కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పురోహిత సంఘం అధ్యక్షులు ఆర్ రవికుమార్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ, రెవెన్యూ, దేవాదాయ శాఖల సిబ్బంది, మరియు స్థానిక పురోహిత సంఘం పురోహితులు సహకరిస్తుండడంతో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న గోదావరి హారతిని చూడడానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోందనీ ఆయన అన్నారు.
పరాభవ నామ సంవత్సరం అధిక జ్యేష్ట మాసం తత్కాల అమావాస్య ఆదివారం జరుగుతున్న ఈ పుణ్య కార్యం పురోహితులు గోదావరి హారతి విశేషాలను, విశిష్టతను భక్తులకు తెలిపి, గణపతి పూజ, దీపోత్సవం భక్తులచే వెలిగింప చేసి, భక్తులు స్పృశించిన పూజా ద్రవ్యాలతో, శ్రీరాముని కి, గోదావరి నదికి అష్టోత్తర శతనామార్చన చేసి లోక కళ్యాణార్ధం ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ఈ మహత్కార్యములో గ్రామస్తులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రామానుగ్రహంతో గోదావరి మాత ఆశీస్సులు పొందుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పురోహితులు సత్య ప్రసాద్ శర్మ, అశోక్ కుమార్ శర్మ, సుబ్రహ్మణ్య ఆచార్యులు, రామాచార్యులు, తేజ శర్మ, శివ,pvsn రెడ్డి హారతులు సమర్పించగా,స్వచ్ఛంద సంస్థలు, స్థానికులు మరియు , అధిక సంఖ్యలోభక్తులు తదితరులు పాల్గొన్నారు.






