27 February, 2026 | 10:33 AM

ఉద్యోగులే సంస్థల బ్రాండ్ అంబాసిడర్లు

27-02-2026 12:16 AM

హెచ్‌ఆర్ పాత్ర కీలకం

నైపుణ్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యం  

3వ హెచ్‌ఆర్ సమ్మిట్‌లో మంత్రి వివేక్  

హైదరాబాద్, ఫిబ్రవరి 26(విజయక్రాంతి): ఏ సంస్థ విజయానికి ఉద్యోగులే అసలు బ్రాండ్ అంబాసిడర్లని, మంచి విధానాలను అమలు చేయడంలో హెచ్‌ఆర్ వి భాగం కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్ర కార్మి క, ఉపాధి, గనులు, భూగర్భశాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. ఉద్యోగులు సంతోషంగా ఉంటే ఉత్పాదకత కూడా మెరుగ్గా ఉంటుందని అన్నారు.

గురువారం హైటెక్ సిటీలోని హెచ్‌ఐసీసీ నోవో టెల్‌లో అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామ ర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా  నిర్వహించిన 3వ హెచ్‌ఆర్ సమ్మిట్‌లో ముఖ్య అతి థిగా పాల్గొని మంత్రి ప్రసంగించారు.ఇక్కడికి రావడం ఆనందంగా ఉంది.. గతంలో నేను సీఐఐ అధ్యక్షుడిగా పనిచేసిన రోజులు గుర్తుకొస్తున్నాయన్నారు. తన తండ్రి కాకా వెంకటస్వామి ఆంధ్రప్రదేశ్‌లోనూ, అనంత రం కేంద్ర ప్రభుత్వంలోనూ కార్మికశాఖ మంత్రిగా పనిచేశారన్నారు.

ఆ రోజుల్లో హెచ్‌ఆర్ సమస్యలు, ఉద్యోగుల వేతనాలు, కార్మిక అంశాలు విస్తృతంగా ఉం డేవని చెప్పారు. ప్రస్తుతం పరిస్థితుల్లో విపరీతమైన మార్పులు వచ్చాయన్నారు. గతంలో హెచ్‌ఆర్ విభాగం అంత ప్రాముఖ్య త కలిగి ఉండకపోయినా, కాలక్రమేణా అది అత్యం త కీలక విభాగంగా మారిందన్నారు.

ఉద్యోగులను సక్రమంగా చూసుకోవడం, మంచి ఫలితాలు సాధించడం ప్రతి యాజమాన్యం, హెచ్‌ఆర్ విభాగాల బాధ్యత అని చెప్పారు.  ఈ సమ్మిట్ ద్వారా సంస్థల అభివృద్ధికి మ రింత ఉపయోగకరమైన మార్గాలు వెలుగులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశా రు. రాష్ట్ర ప్రభుత్వ తరఫున నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులపై సూచనలు ఇవ్వాలని హెచ్‌ఆర్ నిపుణులను కోరారు. పరిశ్రమలతో సమన్వయం సా ధించి ఉపాధి అవకాశాలు పెంచేందుకు అధికారులను ఆదేశించానని మంత్రి తెలిపారు.