కూకట్‌పల్లి శ్రీ చైతన్యలో ఈఎస్‌ఐసీ ఆరోగ్య క్యాంప్
సీబీఎస్‌ఈ నూతన పాఠశాలలో నిర్వహణ
హైదరాబాద్, ఫిబ్రవరి 26(విజయక్రాంతి): కార్మిక రాజ్య బీమా సంస్థ స్వర్ణోత్సవాల్లో భాగంగా కూకట్ పల్లి సీబీఎస్‌ఈ శ్రీ చైతన్య విద్యాసంస్థలో కార్మికులకు, వారి కు టుంబ సభ్యులకు గురువారం ఈఎస్‌ఐసీ ఆరోగ్య క్యాంప్ నిర్వహించారు. సంస్థ అభ్యర్థన మేరకు కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐసీ) మెడికల్ కాలేజ్ డీన్ డాక్టర్ సురేష్ కుమార్ చవాన్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాధిక - సనత్‌నగర్ వార్ల సహకారంతో ఉచిత ఆరోగ్య క్యాంప్, అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు.
ఈ క్యాంప్‌లో శ్రీచైతన్య విద్యాసంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు, వారి కుటుం బ సభ్యులకు ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజ్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు, ఇత ర సిబ్బంది మధుమేహం, రక్తపోటు, హిమోగ్లోబిన్, కంటి పరీక్షలు, వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ చవా న్, రాధికలకు కార్మికుల తరఫున శ్రీచైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ సీమా, డైరెక్టర్ నాగేం ద్ర కుమార్,శ్రీ చైతన్య కూకట్‌పల్లి సీబీఎస్‌ఈ ఏజీఎం శివరామకృష్ణ ,రీజనల్ ఇన్‌చా ర్జి వెనిగళ్ల పద్మజ, అడ్మిన్ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. సుమారు 200 మం ది కార్మికులు హాజరై క్యాంప్‌ను జయప్రదం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.




