10 May, 2026 | 1:02 AM

ఆప్ మంత్రి అరోరా అరెస్ట్

10-05-2026 12:24 AM
  1.   20 బృందాలతో నివాసం, కార్యాలయాల్లో సోదాలు
  2. ఫెమా నిబంధనల ఉల్లంఘన అనీ ఈడీ ఆరోపణ
  3.  మంత్రికి చెందిన ఖాతాల స్తంభన

చండీగఢ్, మే 9: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పంజాబ్ మంత్రి సంజీవ్ అరోరాను ఈడీ అరెస్ట్ చేసింది. అవినీతి వ్యతిరేక నిరోధక చట్టం కింద శనివారం తెల్లవారుజామున 20 వాహనాల్లో వచ్చిన అధికారులు చండీగఢ్‌లోని సెక్టార్ 2లో అరోరా నివాసంలో దాడులు నిర్వహించారు. లూథియానా వెస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి ఆప్ ఎమ్మెల్యేగా ఉ న్నారు. చండీగఢ్, ఢిలీ-ఎన్సీఆర్ ప్రాంతం లో దాడుల తరువాత ఆయన అరెస్టును ఈడీ  ప్రకటించింది.

డొల్ల కం పెనీల పేర్లతో మొబైల్ ఫోన్ కొనుగోళ్లు చేసి రూ. 152.12 కోట్ల నకిలీ బిల్లులను సృష్టించారని, ఫెమా నిబంధనలను ఉల్లంఘించారని ఈడీ  ఆరోపించింది. వీటి సాయంతో అక్రమంగా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్, జీఎస్టీ, ఇతర ఎగుమతి ఆధారిత ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకున్నారని ఈడీ పేర్కొంది.

ఈ సంపాదనంతా దుబాయ్‌లో పెట్టుబడులుగా పెట్టి, అక్రమంగా తిరిగి భారత్‌కు తరలించి మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఈడీ అధికారులు ఆరోపించారు. మంత్రి కి చెందిన బ్యాంకు ఖాతాలు, డీ మ్యాట్ ఖాతాలు, మ్యూ చువల్ ఫండ్‌లను ఈడీ స్తంభింపచేసింది.

తలవంచం: పంజాబ్ సీఎం భగవంత్‌మాన్..

బీజేపీ ఆప్ నాయకులను నయానో భ యానో లొంగదీసుకోవాలని భావిస్తుంది. ఇందులో భాగంగానే గతంలోనూ అరోరా ఇంట్లో సోదాలు చేశారు. ఈడీ అరోరా ఇంట్లో సోదాలు చేయడం ఇది మూడోసారి. వారికి ఏం దొరకలేదు. పంజాబ్ గురువుల భూమి. తమను ఎవరూ లొంగదీసుకోలేరు. మోదీ కుతంత్రాలకు తలవంచం. ఈడీ, బీజే పీ మధ్య ఉన్న అనైతిక బంధం ఈ అరెస్టుతో మరోమారు తేటతెల్లమైనట్లయ్యింది. పంజా బ్ సౌభ్రాతృత్వాన్ని విచ్ఛిన్నం చేయాలని చూ స్తే గట్టిగా ప్రతిస్పందిస్తామని పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ ఆగ్రహాం వ్యక్తం చేశారు.